సుంకర భాస్కర రావు - ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ పితామహుడు
ప్రపంచంలో అత్యధిక ఆదరణ కలిగిన క్రీడ పుట్బాల్. ప్రతి ఖండంలోను ప్రతిభ చూపిన జట్లు మాత్రమే ప్రపంచ పుట్బాల్పోటీలకు అర్హత సాధిస్తాయి. దాదాపు 32 దేశాలు పోటీ పడే ప్రపంచ పుట్బాల్ పోటీలు గురువారం రష్యాలో ప్రారంభమయ్యాయి. నెలరోజులు క్రీడాభిమానులకు పండుగ వాతావరణాన్ని కల్పించే ఈ క్రీడ. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో ఆదరణకు నోచుకోవడం లేదు. ఇకపోతే ఉమ్మడిరాష్ట్రంలో 40ఏళ్ళ క్రితం రాష్ట్రస్థాయి పుట్బాల్ సంఘానికి రాజమహేం ద్రవరం వేదికగా నిలిచింది. ఇక్కడ సుంకర కుటుంబీకులు ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి ఎనలేని సేవలు చేశారు. ప్రస్తుతం ఆదరణ అంతంత మాత్రంగా ఉన్న ఫుట్బాల్ క్రీడకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కృషి చేయాలని పలువురు క్రీడాభిమానులు కోరుతున్నారు.. ఎంతసేపు క్రికెట్..క్రికట్ అంటున్నారే తప్ప.. ప్రపంచదేశాలు పోటీపడి ఆడే వాటిలో మన దేశ క్రీడాకారులు అర్హత సాధిం కపోవడం విచారకరం.ప్రపంచఫుట్బాల్ పోటీలు జరుగుతున్న నేపధ్యంలో జిల్లాలో ఫుట్బాల్ చరిత్రపై కథనం...
1901లో రాజమహేంద్రవరంలో నింబుల్స్ క్లబ్ ఏర్పడింది. బ్రిటిషు వారు పరిపాలిస్తున్న సమయంలో రాజమహేంద్రవరంలో నింబుల్స్ క్లబ్ ద్వారా ఫుట్బాల్ ఆడేవారు. ఆ రకంగా జిల్లాకు ఫుట్బాలను బ్రిటీష్ వారు పరిచయం చేశారు. 1975లో సుంకర భాస్కరరావు కార్యదర్శిగా ఫుట్బాల్ సంఘం ఏర్పడింది. సంఘం ఆధ్వర్యంలో 1977లోపోతుల వీరభద్ర మున్సిపల్ స్టేడియంలో స్పీడన్ వర్సెస్ ఇండియా మహిళల ఫుట్బాల్ పోటీలు తొలిసారిగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల క్రీడాప్రాంగణం, మున్సిపలేడియంలో ఫుట్బాల్ -మ్యాచ్లు ఎక్కువగా నిర్వహించేవారు. ఆరోజుల్లో జిల్లాలో ఫుట్బాల్ క్రీడకు మంచి ఆదరణ ఉండేది. రాజమహేంద్ర వరంకు చెందిన సుంకర కుటుంబీకులు మద్రాస్ నుంచి రాష్ట్రం విడిపోయిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడా సంఘ ఆవిర్భావానికి ఆద్యులయ్యారు. దాదాపు 40 ఏళ్ళ పాటు ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. జిల్లాలో ప్రస్తుతం కాకినాడ, రాజమహేంద్రవరం, తాటిపర్తి, కడియం, అమలాపురం, చింతూరు, రంపచోడవరం, రాజోలు, జగన్నాధపురం ప్రాంతాల్లో ఫుట్బాల్ క్రీడా మైదానాలు అందుబాటులో ఉన్నాయి. అండర్ -10 నుంచి వెటరన్ విభాగం వరకు ఫుట్బాల్ ఆడే క్రీడాకారులు జిల్లాలో 200 వరకు ఉన్నారు. పూర్తిస్థాయి. ఫుట్బాల్ కోర్టు కాకినాడ జిల్లా క్రీడామైదానంలో ఉంది.
జిల్లా ఫుట్బాల్ సంఘానికి ఆకుల సత్యనారాయణ అధ్యక్షునిగా, సుంకర నాగేంద్ర కిషోర్ కార్యదర్శిగా ఎస్.నాగేంద్రరావు నిర్వహణా కార్యదర్శిగా, శ్రీనివాస్ కోశాధికారిగా, ఉపాధ్యక్షులుగా కె. స్పర్జన్ రాజు, టీవీఎస్ రంగారావు, సంయుక్త కార్యదర్శులుగా కౌర్, పి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్లు వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సంఘ నిర్వహణా కార్యదర్శి గంగాధర్ను ఫుట్ బాల్ క్రీడకు జిల్లాలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల చింతూరులో అసిస్టెంట్ కలెక్టర్ అనంద్ ఆధ్వర్యంలో గిరిజన క్రీడాకారులకు ఫుట్బాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం రిలయన్స్ వారి సౌజ్యనంతో ప్రారంభించామని అన్నారు.
ఫుట్బాల్ కోర్టు కొలతలు
ఫుట్బాల్ కోర్టు 100- 130 యాడ్ల పొడవు, (320 అడుగుల పొడవు), 64-75 మీటర్ల వెడల్పు ఉంటుంది. నెట్ పొడవు భూమిపై నుంచి 8 అడుగులు, వెడల్పు 24 అడుగులు. జట్టు సభ్యులు 11 మంది రిఫరీలు ముగ్గురు, వీరిలో మెయిన్ రిఫరీ ఒకరు, అసిస్టెంట్ రిఫరీలు ఒకరు, ఆట సమయం 45 నిముషాలు, 10 నిముషాలు విశ్రాంతి. తిరిగి 45 నిముషాలు.. ఈ సమయంలో ఎవరు అత్యధిక గోల్స్ చేస్తారో వారిని విజేతగా నిర్ణయిస్తారు. డ్రా అయితే టై బ్రేకర్ ద్వారా విజేతలను నిర్ణయిస్తారు.
Great
ReplyDelete