FATHER OF NEUROSURGERY ANDHRA PRADESH - SUNKARA BALAPRAMESHWARA RAO
న్యూరో సర్జరీ పితామహుడిగా పేరొంది.. వేలాది శస్త్రచికిత్సలు చేసిన ఘనత సాధించి ఆణిముత్య డాక్టర్ సుంకర బాలపరమేశ్వర రావు. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి డైరెక్టర్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా అనేక బాధ్యతలు నిర్వహించిన సుంకర బాలపరమేశ్వర రావు తెలంగాణ ప్రభుత్వం చేత జీవిత సాఫల్య అవార్డుతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులను, గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో న్యూరో సర్జరీని అభివృద్ధి చేసినందుకు గాను 2008లో ప్రతిష్టాత్మక డాక్టర్ బిసి రాయ్ అవార్డు, ఎన్టీఆర్ యూనివర్సిటీ అప్ హెల్త్ సైన్సెస్ చేత గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. ఆరోగ్యమంటే శరీర ధృడత్వం అని నమ్మిన బాలపరమేశ్వరరావు క్రీడాకారుడు, టెన్నిస్ ఛాంపియన్ కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిబ్రవరి 12న 1928లో జన్మించారు. శ్రీ సుంకర కనకం, శ్రీమతి సుంకర సీతమ్మ ఆయన తల్లిదండ్రులు. ఆయన ప్రాథమిక విద్యను మద్రాసులోని మైలాపూర్ లోని సెయింట్ థామస్, కాన్వెంట్ లోనూ, తదుపరి మచలీపట్నం భీమవరంలోనూ పూర్తి చేశారు. 1945 నుంచి 1950వరకు ఆంధ్రా మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను (ఎంబిబిఎస్) చదివారు. ఆయన 1950లో అసాధారణ ప్రతిభకు గానూ సిల్వర్ జూబ్లీ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఎంఎస్ జనరల్ సర్జరీని 1954లో ఆంధ్ర మెడికల్ కళాశాల విశాఖపట్నంలో చేశారు. బాలపరమేశ్వర రావు ఆరు సంవత్సరాలు ఆంధ్రమెడికల్ కాలేజ్ లో చేసిన తరువాత డిప్యూటేషన్ పై మద్రాసులో న్యూరో సర్జన్ శిక్షణ కొరకు వెళ్లారు. అక్కడ ప్రముఖ న్యూరోసర్జన్ అయిన బి. రామమూర్తి అనే ప్రొఫెసర్ వద్ద శిక్షణ పొందారు. ఆ తరువాత యునైటెడ్ కింగ్ డమ్ కు వెళ్లారు. చివరికి ఆంధ్రా మెడికల్ కాలేజీ విశాఖపట్నంలో స్థిరపడ్డారు. 1956లో ఆయన ఆంధ్ర మెడికల్ కాళాశాల మరియు కింగ్ జార్జి అసుపత్రి విశాఖపట్నంలలో న్యూరోసర్జన్ విభాగాన్ని ప్రారంభించారు. ఆ విభాగాలు 2006లో గోల్డెన్ జూబ్లీ ఉత్సావాలను జరుపుకున్నాయి.
శ్రీ సుంకర కనకం, శ్రీమతి సుంకర సీతమ్మ
1960 నుంచి 1974 వరకూ డాక్టర్ బాలపరమేశ్వర రావు ఆంధ్ర వైద్య కళాశాలలో న్యూరోసర్జరీ ప్రొఫెసర్ 1974-76 మధ్య ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో పనిచేశారు. న్యూరాలజికల్ సోసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా 1974లో బాధ్యతలు నిర్వహించారు. డాకర్ బాలపరమేశ్వర్ రావు న్యూఢిల్లీలోని నేషనల్ అకాడమీ అప్ మెడికల్ సైన్సెస్లో 1975 నుంచి సభ్యుడిగా కొనసాగారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క సెనేట్ సభ్యుడు. ఆయన 1973లో న్యూరోలజికల్ సోసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా, 1974లో అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ ఎన్ టి ఆర్ హెల్ల్ సైన్సెస్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమి అఫ్ మెడికల్ సైన్సెస్ ఎమెరిటస్ ప్రొఫెసర్ గా కూడా కోనసాగారు. డాక్టర్ ఎన్ టి ఆర్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, తిరుపతి గౌరవ న్యూరోసర్జన్ గా కీర్తి గడించారు. 1976-80 మధ్య సూపరిండెంటెండ్ న్యూరో సర్జన్ గా నిజాం అర్థోపెడిక్ హాస్పిటల్ అండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్పెషలిటీస్, హైదరాబాద్ లో పనిచేస్తూ పరిశోధనలు చేశారు. ఉస్మానియా యూనివర్శిటీలో న్యూరో సర్జన్ ఫ్రోఫెసర్ గా, ప్రిన్సిపాల్ గా (1980) ఫాకల్టీ అఫ్ మెడిసిన్ లో డీన్ గా (1981-83) పనిచేశారు. మానసిక వైద్య చికిత్సలో నూతన ప్రక్రియలను ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ ట్రీట్ మెంట్ ను పూర్తిగా విమర్శించారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ అందుకున్నారు. వివిద వైద్య సంబంధిత అసోసియేషన్ లో ఉన్నత పదువులను పొందారు. ఆయన 1983లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో పదవీవిరమణ చేశారు.
1983-86 వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ గా, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైద్యశాస్త్ర విభాగం డీన్ గా సేవలందించారు. బాలపరమేశ్వర రావు వృత్తిపై భక్తి, చైతన్యంతో తన జూనియర్ సిబ్బందికి కఠినమైన క్రమశిక్షణతో కూడిన సామర్థ్యాన్ని పెంచారు. ఆయన వివిధ సమావేశాల్లో 50 కన్నా ఎక్కువ ప్రతాలను సమర్పించారు. ఆయన సమర్పించే శాస్త్రీయ పత్రాలు, ప్రసంగాలు, ప్రజెంటేషన్ లు ప్రత్యేకతను చాటిచెప్పేవే కావడం గమనార్హం. డాక్టర్ బాలపరమేశ్వర రావు సమావేశాల్లో విద్యాసంబంధ సెషన్లు అధ్యక్షత వహించేవారు. ఆయన న్యూరోసర్జర్ విభాగంలో 19 మందికి పోస్ట్ గ్రాడ్యూయేషన్ సమయంలో రీసస్ మరియు సిద్ధాంతాలు కోసం 19 మార్గనిర్దేశనం చేశారు. ఆయన న్యూరో సర్జరీ కోసం వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశీలకుడిగా మరియు పేపర్ సెట్టర్ గా కూడా ఉన్నారు. అంతేకాదు తన న్యూరోసర్జన్ కు సంబంధించి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో 17 ఉత్సవాలను నిర్వహించారు. 40 మంది నిపుణుల కమిటీలు మరియు ఎంపిక బోర్డుల సభ్యుడిగా కూడా సేవలందించారు. ఆయన శిష్యులు అనేక మంది దేశవిదేశాల్లో వున్న ప్రధాన సంస్థలలో న్యూరోసర్జన్ ప్రొఫెసర్స్ గా స్థిరపడ్డారు. ఆయన సోదరుడు సుంకర వెంకట అదినారాయణ రావు కూడా ప్రముఖ ఆర్థోపెడిక్ (ఎముకలు) వైద్యులే. విశాఖపట్నం ప్రేమ అసుపత్రి ద్వారా ఆయన లక్షలాది మంది పోలియో వ్యాధిగ్రస్థులకు సర్జరీలు చేసి ఎంతో పేరు గడిస్తున్నారు.
After graduating as the best outgoing student in MBBS, he did MS (General Surgery) and trained in Neurosurgery under Dr. B. Ramamurthy in Chennai. He was 2nd amongst 8 siblings. There were days when his father couldn't send him mess fees forcing him to starve for days on end.
He was a beneficiary of the Colombo Plan Scholarship. He underwent training at the National Hospital for Nervous Diseases, Queen Square, London.
He was later the First Superintendent (Director) of Nizam’s Institute of Orthopedics and Specialities (now NIMS), Hyderabad, from 1976-1981. He served as Principal, Osmania Medical College, Hyderabad from 1981-83.
He received many awards such as Dr. B.C.Roy National award in 1989, honorary doctorates and multiple Lifetime Achievement Awards. But the appreciation of patients and their families were always special.